విశాఖ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మరో 4నామినేషన్లు
By ఆర్ కిరణ్ కుమార్ 70చూసినవారుఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం మరో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్, రాయల సత్యన్నారాయణ, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ కు సంబంధిత పత్రాలను అందజేశారు.