విశాఖ పోర్టు స్టేడియం వేదికగా ఈనెల 6 నుంచి నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ కరాటే పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో దేశ, విదేశాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ విశాఖలో రెండోసారి కూడా అంతర్జాతీయ కరాటే పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిందన్నారు..