అబద్దాలు, అసత్యాలే జగన్ అజెండా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని జగన్ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. జగన్ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యబద్దంగా పాలన నడిపించలేదని అధికారం కోల్పోయేసరికి విశ్వసనీయత అనే కొత్త మాటలు వస్తున్నాయన్నారు.