విశాఖలోని 63వ వార్డు టీడీపీ అధ్యక్షుడిగా జెర్రిపోతుల నరసింహారావు ఎన్నికయ్యారు. ఇదే పదవి కోసం కృష్ణ, నర్సింగరావు పోటీ పడ్డారని సమాచారం. ఇరువురు సమర్థ నాయకులు కావడంతో అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో ఎమ్మెల్యే పర్యవేక్షించాల్సి వచ్చిందని స్థానిక నాయకులు తెలిపారు. చివరగా వార్డు అధ్యక్షుడిగా నర్సింగరావు, కార్యదర్శిగా కృష్ణను కార్పొరేటర్ గల్లా చిన్న పర్యవేక్షణలో శుక్రవారం ఎన్నుకున్నారు.