గాజువాక సమీపంలోని షీలానగర్ టోల్‌గేట్ వద్ద విశాఖ పోర్ట్ నిర్మించనున్న బొగ్గు పొడి నిల్వల గొడౌన్‌ను తక్షణమే నిలుపుదల చేయాలని మింది, అక్కిరెడ్డిపాలెం, పంచవటి గ్రామాల ప్రజలు, అఖిలపక్ష పార్టీల నేతలు కోరారు. సోమవారం నిర్మాణాలను పరిశీలనకు వచ్చిన విశాఖపట్నం పోర్ట్ అధికారి శాంతి స్వరూప్‌ను నిలదీసి ప్రశ్నించారు. గ్రీన్ పెట్రోలియం నిల్వల కోసం నిర్మిస్తున్న గొడౌన్లతో భూగర్భ జలాలు కలుషితమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.