విశాఖ స్టీల్ కాంట్రాక్టు కార్మికుల తొలగింపును తక్షణం ఆపకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. సోమవారం కోక్ ఓవెన్ ఆర్‌ఎంహెచ్‌పి. టిపిపి సింటర్ ప్లాంట్ హెచ్‌ఒడి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఎవ్వరినీ తొలగించబోమని అంగీకరించి, ఇప్పుడు దొడ్డిదారిన కాంట్రాక్టు కార్మికులను తొలగించే యత్నాలు చేస్తున్నారన్నారు.