రాజమండ్రి నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు లారీలను గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి సీజ్ చేశారు. రాజమండ్రి నాలుగు ఇసుక లారీలు వచ్చినట్టు సమాచారం అందుకున్న ఆమె సోమవారం సాయంత్రం సంఘటన స్థలానికి వెళ్లి బిల్లులు పరిశీలించారు. అయితే ఇవన్నీ రాజమండ్రికి చెందిన బిల్లులు కావడంతో లారీలను స్వాధీనం చేసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలించారు.