విశాఖ స్టీల్ ప్లాంట్ లో మే 20న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మికుల సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ బిసి గేట్ వద్ద శుక్రవారం ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.