విశాఖ ఉక్కు కర్మాగారంలో అతి కీలకమైన సీఐఎస్ఎఫ్ కు చెందిన 438 మంది సిబ్బంది ని తొలగించడం సరైంది కాదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ , పోరాట కమిటీ నేత వర సాల శ్రీనివాస్ రావు అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపడుతున్న రిలే దీక్షలు మంగళవారం 1, 454 వ రోజుకు చేరుకున్నాయి.