గోపాలపట్నంలోని వెంకటాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే స్పందించిన ఉపాధ్యాయులు వారిని గోపాలపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర దుర్గంధ వాసన రావడంతో సుమారుగా 11 మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. వీరిలో ముగ్గురు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.