నర్సీపట్నం మండలం శివపురంలో మంగళవారం సాయంత్రం శ్రీ అభయాంజనేయ స్వామి తీర్ధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తీర్థంలో రంగులరాట్నం వంటివి ఏర్పాటు చేయడంతో పిల్లలు సందడి చేశారు. తీర్థ మహోత్సవంలో ప్రదర్శించిన కాంతారా డాన్సులు ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్థం సందర్భంగా శివపురం ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది.