నర్సీపట్నం మండలంలో శివపురం శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయ వద్ద మంగళవారం జరిగిన తీర్థ మహోత్సవంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. సతీమణి పద్మావతితో కలిసి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ అయ్యన్న దంపతులను సన్మానించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు సంస్కృతి కార్యక్రమాలను కొద్ది సేపు వీక్షించారు.