విశాఖపట్నం నగర పాలక సంస్థ ఉత్తర నియోజకవర్గం పరిధిలో గల 53, 54 వార్డులలో నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 70 లక్షల రూపాయలు మంజూరు చేసిందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉత్తర ఎమ్మెల్యే పి, విష్ణుకుమార్ రాజు, 53వ వార్డు కార్పొరేటర్ బర్ఖత్ ఆలీ, 54వ వార్డు ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.