విశాఖ: చెత్త తరలింపు పరిశీలన

51చూసినవారు
విశాఖ: చెత్త తరలింపు పరిశీలన
జీవీఎంసీ 49 వ వార్డులోని జోనల్ 5 జోనల్ కమిషనర్ రాము గురువారం పర్యటించారు. వార్డులోని చెత్త తరలింపు విధానాన్ని ఆయన నేరుగా పరిశీలించారు. వార్డు శానిటేషన్ కార్యదర్శులతో ఆయన సమావేశమై సింగిల్ యూస్ ప్లాస్టిక్ నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సానిటరీ ఇన్స్పెక్టర్ త్రినాధరావును ఆయన ఆదేశించారు.