విశాఖ: "కళాకారుల వెతలు తీర్చండి"

60చూసినవారు
విశాఖ: "కళాకారుల వెతలు తీర్చండి"
ఆంధ్రప్రదేశ్ లో కళాకారులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని వారిని ఆదుకోవాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖ‌కు చెందిన‌ ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ బుధ‌వారం లేఖ‌ రాశారు. ప్రతీ కళాకారుడికి పింఛన్ మంజూరు చేయాలని, కళాకారుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలలో 50శాతం ఫీజు రాయితీ ప్రకటించాలని, కళాకారుల కుటుంబాలకు ఇళ్ల‌ స్థలాలు ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత పోస్ట్