శ్రీ సాయి మాతా క్రియేషన్స్ బేనర్ పై పి. సాయిరాం దర్శకత్వం లో స్వయ నిర్మాణంలో నిర్మించిన ”స్టూడెంట్” చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం బీచ్ రోడ్ లోని గ్రీన్ పార్క్ హోటల్లో హీరో సుమన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఇందులో ఒక చక్కని గుర్తుండిపోయే పాత్ర చేశానన్నారు. ఆ పాత్ర తనకి చాలా సంతృప్తి నిచ్చిందని తెలియజేశారు.