కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో వాల్తేరు రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూ, విశాఖ డివిజన్‌గా పునర్విభజన చేయాలని రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను సాకారం చేయడమే కాకుండా, రైల్వే ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిని కూడా తొలగించిందని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.