కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులంతా విశాఖకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.