1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర వ్యాప్త మన్యం బందుకు వాహనదారులు సహకరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస. విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. ఆదివారం చింతపల్లి మండలంలోని జడ్పిటిసి బాలయ్యతో కలిసి ఆయన వాహనదారులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు సహాయ సహకారాలు అందించి గిరిజన చట్టాలు అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.