పాడేరు మండలంలోని మినుములూరులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస. విశ్వేశ్వరరాజు ఆకస్మికంగా తనకి చేశారు. ఇందులో భాగంగా ఆయన రోగుల స్థితిగతులు మందులు నిల్వ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ విషజ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆస్పత్రి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు.