పాడేరు: స్వచ్ఛమైన తాగునీటిని సద్వినియోగం చేసుకోండి

81చూసినవారు
పాడేరు: స్వచ్ఛమైన తాగునీటిని సద్వినియోగం చేసుకోండి
వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న స్వచ్ఛమైన తాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కోరారు. సోమవారం పాడేరులోని పీఎంఆర్సీ వద్ద గల పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఆర్ఓ ప్లాంట్ ను కలెక్టర్ డాక్టర్ తనూజ రాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులపై అభిమానంతో స్టేట్ బ్యాంకు వారు వితరణ చేసిన ఆర్ఓ ప్లాంట్ వల్ల నీటి కాలుష్యం లేని స్వచ్ఛమైన నీటిని అందించడం జరుగుతుందన్నారు. ఆర్ఓ ప్లాంట్ నిర్వహణను విద్యార్థులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్