ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ గంపరాయి గ్రామం నుంచి కృష్ణాదేవిపేట వెళ్లే రహదారి మార్గమధ్యంలో కొండచరియలు విరిగి పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పంచాయతీ సర్పంచి సుర్ల చంద్రరావు శనివారం ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్ర వాహనాన్ని ఏర్పాటు చేసి రహదారికి అడ్డంగా విరిగి పడిన కొండచరియలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.