కోటవురట్ల: వయోజనులను అక్షరాస్తులుగా తీర్చిదిద్దాలి

76చూసినవారు
కోటవురట్ల: వయోజనులను అక్షరాస్తులుగా తీర్చిదిద్దాలి
వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోటవురట్ల ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. వయోజనులకు చదువు చెప్పేందుకు అక్షర వెలుగు, సంక్షిప్త వాచకం, మార్గదర్శిని పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్