నక్కపల్లి: ప్రమాద సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

81చూసినవారు
నక్కపల్లి: ప్రమాద సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన
ప్రకృతి విపత్తులపై అవగాహన అత్యవసరమని జాతీయ విపత్తు స్పందన దళం 10వ బెటాలియన్ కమాండర్ వై. సత్యనారాయణ తెలిపారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట హైస్కూల్లో బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 27 వరకు కోస్తా తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్