రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి మండల పర్యటనలో భాగంగా పద్మ శాలీయుల కులదైవం అయిన భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవం, శూలాల పండగకు సంబంధించి గోడపత్రికను మంగళవారం ఆవిష్కరించారు. పద్మ శాలీయులకు అత్యంత ముఖ్యమైన ఈ పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.