హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గంలోని హైవేపై అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్. రాయవరం మండలం ధర్మవరం హైవే నుంచి పాయకరావుపేట పట్టణం వరకూ ప్రతి జంక్షన్లలోనూ పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఐలు జి. అప్పన్న, కె. కుమారస్వామి, ఎల్. రామకృష్ణ పర్యవేక్షణలో సోమవారం ఈ పనులను ప్రారంభించారు.