ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే విధానాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అమల్లోకి తీసుకువచ్చినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె సోమవారం ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రతి శనివారం పాఠశాలలో కో-కరిక్యులమ్ కార్యకలాపాలు నిర్వహించాలన్న మంత్రి సూచన మేరకు విద్యాశాఖ ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.