రాష్ట్రవ్యాప్తంగా రౌడీ షీటర్ల కలిదకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం విశాఖలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలను కూడా తమకు అందజేయాలని అడుగుతున్నట్లు పేర్కొన్నారు.