పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వి. కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ సందర్శించాలన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడిచేయడమంటే రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని అన్నారు.