ఎస్. రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో టెన్త్ విద్యార్థుల నైట్ స్టడీ సెంటర్ ను సోమవారం రాత్రి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పొన్నాడ అప్పారావు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అప్పలనాయుడు, గారా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.