పరవాడ మండలం హనుమాన్ నగర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తులు పలువురు ఆలయంలో స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రతి ఏటా ఆలయంలో రథసప్తమి రోజున స్వామికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపాలెం సర్పంచ్ కూండ్రపు వరలక్ష్మి, పైల నేస్తాలు, దేవుడమ్మ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.