కూనవరం మండలం లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని మిడ్ డే మీల్స్, అంగన్వాడీ, ఆశా వర్కర్స్ బుధవారం వినతీ పత్రాన్ని అందజేశారు. సీఐటీయూ నాయకులు కొమరం పెంటయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని చిన్న చూపు చూస్తున్నాయని, వారంతా చాలి చాలని జీతంతో వారి జీవితాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.