విశాఖలో కాస్ట్‌లీ అన్నదానం

543చూసినవారు
వినాయక మండపం వద్ద అన్నదానం అంటే మనకు పులిహోర, రెండు కూరలు, ప్రసాదం, సాంబారు గుర్తొస్తాయి. కానీ విశాఖలోని అల్లిపురం జంక్షన్‌లోని ఓ వినాయక మండపం వద్ద గురువారం ఏర్పాటు చేసిన అన్నదానంలో ఐటెమ్స్‌ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. 2 లీటర్‌ డ్రింక్‌ బాటిల్‌, ఐస్‌ క్రీమ్‌, బిర్యానీ, పూతరేకులు, స్వీట్‌, అరటిపండు, పలురకాల శాఖాహర కూరలతో భోజనం వడ్డించారు. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి భోజనాలు చేశారు.