విశాఖ వేదికగా పోలీస్ బేరక్స్ గ్రౌండ్ లో ఈ నెల 30 తేదీ నుంచి ప్రారంభం కానున్న 5వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీల పోస్టర్‌ను జేసీ మయూర్ అశోక్ శుక్రవారం ఆవిష్కరించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు.