విశాఖలోని ముడసర్లోవ పార్కులో కొన్నాళ్లుగా కాకులు, కొంగలు మృత్యువాత పడుతున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు కాకులు, కొంగలు మృతి చెందడాన్ని పార్కులో సిబ్బంది గుర్తించారు. సోమవారం కూడా మూడు కాకులు చనిపోగా, మరో రెండు కాకులు అస్వస్థతకు గురై ఎగరలేకపోవడం, అరవక పోవడాన్ని గుర్తించి పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెటర్నరీ సిబ్బంది పార్కుకు వచ్చి మృతి చెందిన కాకులను ల్యాబ్‌కు తీసుకెళ్లారు.