రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 9, 417 కోట్లు కేటాయించారని విశాఖలోని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ మనోజ్‌కుమార్ సాహూ వెల్లడించారు. డీఆర్‌ఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో కొత్తగా ఏర్పాటుచేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు బడ్జెట్‌లో తప్పకుండా నిధులు వస్తాయని, ఆ వివరాలు పింక్ బుక్‌లో ఉంటాయని, అది ఇంకా వాల్తేరు డివిజన్‌కు అందలేదన్నారు.