ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ నామినేషన్ వేయగా ఆయన వెంట ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఉన్నారు.