విశాఖలో తీవ్రంగా ఉన్న వేసవి తాపం నుంచి ప్రజలను రక్షించేందుకు జీవీఎంసీ అన్ని జోన్లలో పర్యావరణహిత చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జోన్-4 పరిధిలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పర్యావరణహిత చలివేంద్రాన్ని మేయర్ స్వయంగా ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడకు వచ్చిన ప్రజలకు చల్లటి తాగునీటిని అందించారు.