విశాఖ రైతు బజార్లలో సబ్‌జీ కూలర్లు ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఎంవీపీకాలనీ, గోపాలపట్నం రైతు బజార్లలో వీటిని ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేకుండా కేవలం నీటితో కూలర్లు పనిచేస్తాయి. ఇందులో కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసిన కూరగాయాలు నాలుగు రోజులపాటు తాజాగా ఉంటాయి. దీని ధర రూ. 50వేలు కాగా. రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేస్తున్నామని రైతు బజార్ అధికారులు సోమవారం తెలిపారు.