విశాఖలోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్ యాజమాన్యం కార్మికులను అక్రమంగా తొలగించిన నేపథ‍్యంలో మంగళవాం విశాఖ జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వై రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిటిల్ ఏంజెల్ స్కూల్ యాజమాన్యం ముగ్గురు కార్మికులను అక్రమంగా తొలగించిందన్నారు.