సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అంకితభావం, దృఢ సంకల్పంతో అనేక ఒత్తుడులను ఎదుర్కొని ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు అన్నారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ (యూజెఎఫ్) అధ్యక్షులు ఎం. ఆర్. ఎం వర్మ సారధ్యంలో రూపొందించిన డైరీ, పాకెట్ బుక్ ను ఎస్పీ కార్యాలయ ఆవరణంలో అడిషనల్ ఎస్పీ ఆవిష్కరించారు.