గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల భారం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై పడిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కోన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక పథకాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తోందని అన్నారు.