యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు మున్సిపాలిటీ తాగునీటి విభాగం ఏఈ గణపతిరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలో ధర్మవరం, పాత ఎస్బీఐ కాలనీలో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిని పరిశీలించారు. తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షించినట్లు తెలిపారు. నివేదికను అమరావతి పట్టణ మున్సిపాలిటీ శాఖకు పంపిస్తామన్నారు.