రాంబిల్లి: విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దు

80చూసినవారు
రాంబిల్లి: విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దని డిప్యూటీ డీఈవో పి. అప్పారావు సూచించారు. రాంబిల్లి మండలం జంపపాలెం జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థుల ఇళ్లకు డిప్యూటీ డీఈవో మంగళవారం రాత్రి వెళ్లి పలు సలహాలు ఇచ్చారు. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో శ్రద్ధగా చదవాలన్నారు. ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా పరీక్షలు రాయలన్నారు.

సంబంధిత పోస్ట్