అమరావతి నిర్మాణం.. ల్యాండ్‌ పూలింగ్‌కు సీఆర్డీఏ అనుమతి

0చూసినవారు
అమరావతి నిర్మాణం.. ల్యాండ్‌ పూలింగ్‌కు సీఆర్డీఏ అనుమతి
AP: రాజధాని అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై సీఆర్డీఏ ఆమోదం లభించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 7 గ్రామాల్లో అదనపు ల్యాండ్‌ పూలింగ్‌కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది. కొత్తగా 20,494 ఎకరాలకు CRDA ఆమోదం లభించింది. భూమి విలువ పెరగాలంటే 2500 ఎకరాలలో స్మార్ట్ సిటీ, 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ, 5000 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అవసరం." అని అన్నారు.

సంబంధిత పోస్ట్