ఏపీ రాజధాని అమరావతే అన్న మాటపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. ఆదివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. 'గడిచిన ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌కు చిటికెడు మట్టి వేయలేదు.' అని ఆమె అన్నారు.