ఎఫ్‌-22 రాఫ్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా

58చూసినవారు
ఎఫ్‌-22 రాఫ్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా
అత్యాధునిక ఫైటర్ జెట్‌ అయిన ఎఫ్‌-22 రాఫ్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యుద్ధ విమానాల చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఫైటర్‌గా గుర్తింపు పొందిన ఎఫ్‌-22ను ఇప్పటి వరకు అమెరికా ఏ మిత్ర దేశానికీ విక్రయించలేదు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేసిన ఈ జెట్‌ను తాజా టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ చేసేందుకు అమెరికా రెడీ అయ్యింది.

సంబంధిత పోస్ట్