AP: డ్యాన్స్ మాస్టర్, చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ ‘తల’ సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖకు వచ్చారు. హీరో రాగిణిరాజ్, నటుడు ముక్కు అవినాష్‌తో కలిసి ఆయన రామా టాకీస్ కూడలి సమీపంలోని అన్న క్యాంటీన్‌కి వెళ్లి భోజనం చేశారు. ‘అన్న క్యాంటీన్‌లో ఇంత మంచి భోజనం లభిస్తుందంటే నమ్మలేకపోతున్నాం. అదీ రూ.5కే. మీకు మంచి ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రజలు అదృష్టవంతులు.’ అని అమ్మ రాజశేఖర్ ప్రశంసించారు.