2005 డిసెంబర్ నెలలో ముంబై లోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయి క్రియాశీల రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాతి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించుకున్నారు. ‘ఇకనుండి లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్'లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు' అని ప్రకటించారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో 16 ఆగస్టు 2018న మృతిచెందారు.