ఏపీలో ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో నిర్వాహక కమిటీ వేసింది. వరల్డ్ యోగా డే సందర్భంగా జూన్ 21న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం హోం, ఆరోగ్య, టూరిజం, సాంఘిక సంక్షేమ, మానవ వనరుల శాఖ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును నియమించింది.